లక్నో: ఒక మహిళ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే దానికి బదులు చికెన్ బిర్యానీ ఆమెకు అందింది. (woman gets chicken biryani) కొంత తిన్న తర్వాత నాన్ వెజ్ బిర్యానీగా ఆమె గ్రహించింది. దీంతో ప్యూర్ వెజిటేరియన్ అయిన ఆ మహిళ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమె ఫిర్యాదుతో రెస్టారెంట్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఛాయా శర్మ అనే మహిళ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా లక్నో కబాబ్ పరాఠా రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే వెజ్ బిర్యానీ బదులుగా చికెన్ బిర్యానీ ఆమెకు డెలివరీ అయ్యింది.
కాగా, ఈ విషయం తెలియని ఛాయా శర్మ ఆ బిర్యానీ తిన్నది. కొంచెం తిన్న తర్వాత ఆ బిర్యానీ నాన్ వెజ్ అని ఆమె గ్రహించింది. దీంతో వెంటనే ఆ ఫుడ్ సెంటర్కు ఫోన్ చేసింది. అయితే అది అప్పటికే మూసేయడంతో ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. స్వచ్ఛమైన శాఖాహారి అయిన తాను నాన్ వెజ్ బిర్యానీ కొంచెం తిన్నట్లు కన్నీరుమున్నీరైంది. ఆ రెస్టారెంట్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే బిర్యానీని మార్చారని ఆరోపించింది. ఫిర్యాదు అందుకున్న నోయిడా పోలీసులు దీనిపై స్పందించారు. బిర్యానీని ప్యాక్ చేసిన రెస్టారెంట్ సిబ్బందిని అరెస్టు చేశారు.
“मैं प्योर वेजिटेरियन हूं”#GreaterNoida
ऑनलाइन ऑर्डर की वेज बिरयानी,निकली चिकन बिरयानी
वेजिटेरियन युवती ने वीडियो जारी कर लगाया आरोप
वीडियो तेजी से सोशल मीडिया पर हो रहा है वायरल
नवरात्रों में जानबूझकर भेजा गई चिकन बिरयानी : युवती
ऑर्डर के बाद रेस्टोरेंट हो गया था बंद… pic.twitter.com/M5q9KpkItq
— News1India (@News1IndiaTweet) April 7, 2025