న్యూఢిల్లీ: ఒక మహిళ పుట్టిన రోజును కొందరు వ్యక్తులు భిన్నంగా జరిపారు. బర్త్ డే కేక్‌లో రూ.500 నోట్లు ఉంచారు. ఆ కేక్ కట్ చేసి ‘హ్యాపీ బర్త్ డే’ అని ఉన్న లేబుల్‌ను ఆ మహిళ లాగింది. పెద్ద కవర్లో ఉంచిన రూ.500 నోట్లు వరుసగా రావడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. (Notes Inside Birthday Cake) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక మహిళ బర్త్ డేను కొందరు వ్యక్తులు వెరైటీగా సెలబ్రేట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే’ లేబుల్ ఉన్న కేక్‌ను ఆమె ముందు ఉంచారు. ఆ లేబుల్‌ను ఆమె పైకి లాగింది. దీంతో పెద్ద కవర్ రోల్లో ఉంచిన రూ.500 నోట్లు వరుసగా బయటకు వచ్చాయి. చాలాసేపు దీనిని బయటకు లాగిన ఆ మహిళ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. అనంతరం అక్కడున్న కొందరు రూ.500 నోట్ల కవర్ దండను ఆమె మెడలో వేశారు. వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పారు.
కాగా, ఈ వెరైటీ బర్త్‌డే సెలబ్రేషన్ ఎప్పుడు, ఎక్కడ జరిగిందో అన్నది తెలియలేదు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ఈ కేక్ వెరైటీగా ఉందని కొందరు ప్రశంసించారు. కరెన్సీ నోట్లున్న ఇలాంటి బర్త్ డే కేక్ తమకు కూడా కావాలని మరి కొందరు చమత్కరించారు. ఈ వీడియో క్లిప్‌ను వేలాది మంది లైక్ చేశారు.