Uttarakhand: గంగానది వద్ద మద్యం తాగి.. పోలీసులతో మహిళ వాగ్వాదం.. వీడియో వైరల్
Uttarakhand: రిషికేశ్‌లో ఓ మహిళ గంగానది ఘాట్ వద్ద మద్యం తాగి హల్చల్ చేసింది. అడ్డుకున్న స్థానిక పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. టూరిస్టులు లేకుంటే మీకు రోజు గడవదని ఆమె తన వీడియోలో హెచ్చరించింది.
రిషికేశ్: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని రిషికేశ్‌లో ఓ మహిళ గంగానది తీరం వద్ద మద్యం తాగి హల్చల్ చేసింది. అడ్డుకున్న స్థానిక పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. నీలకంఠ మార్గంలో ఉన్న పూల్ ఛాటి ఏరియాలో ఈ ఘటన ఏప్రిల్ 6వ తేదీన జరిగింది. హర్యానాకు చెందిన ఓ మహిళ .. గంగానది ఘాట్ వద్ద మద్యం సేవించింది. పబ్లిక్‌గా మద్యం తాగవద్దు అని పోలీసులు వారించారు. కానీ ఆమె వారితో కొట్లాటకు దిగింది. గట్టిగా అరుస్తూ పోలీసుల మీదకు వెళ్లింది. మేం టూరిస్టులం, మేం వస్తేనే మీకు రోజు గడుస్తుందని ఆమె అరిచింది. స్వంత డబ్బులతో మద్యం సేవిస్తున్నానని, టూరిస్టులతో వ్యవహరించే తీరు ఇది కాదు అని ఆమె పేర్కొన్నట్లు వీడియోలో ఉంది. చివరకు ఆమె భర్త వచ్చి ఆ గొడవను ఆపాడు. ఆ మహిళ ప్రవర్తించిన తీరు పట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
A woman from Haryana was drinking alcohol with her husband on the Ganga riverbank in Rishikesh. When locals & police stopped them, she lashed out: ‘We tourists sustain your livelihood… your money is what we’re drinking!’
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 7, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

