న్యూఢిల్లీ : ఖాళీ విమానాల్లో ఎయిర్ హోస్టెస్‌లు డ్యాన్స్ చేసిన వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి. అయితే లేటెస్ట్ వీడియోలో షాహిద్ కపూర్ వివాహ్ సాంగ్‌కు విమానంలో క్రేజీ స్టెప్స్‌తో ఉర్రూతలూగించిన యువతి వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. అయితే అమ్మడు చేసిన పనికి నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు.
షాహిద్ కపూర్ సాంగ్‌కు ఇన్ఫ్లుయన్సర్ శిబా ఖాన్ స్టైలిష్ మూమెంట్స్‌తో ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉన్నాఈ వైరల్ క్లిప్‌ను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 1.4 కోట్ల మంది వీక్షించారు. హమారీ షాదీ మే సాంగ్‌కు యువతి డ్యాన్స్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
2006లో విడుదలైన మూవీలో ఈ సాంగ్‌ను షాహిద్ కపూర్, అమృతా రావులపై చిత్రీకరించారు. విమానం వేగం నెమ్మదిగా ఉందని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు పెదవివిరిచారు. విమానంలో ప్రయాణీకుల మధ్య డ్యాన్స్ చేయడం సరైంది కాదని, డ్యాన్స్ పెర్పామెన్స్కు ఇది సరైన ప్రదేశం కాదని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.
Read More