న్యూఢిల్లీ : ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయన్సర్ మెకెన్నా చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్కైడైవింగ్ చేస్తూ ఆమె చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో (viral video) హాట్ టాపిక్ అవుతుంటాయి. పదివేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తూ మెకెన్నా మేకప్ అప్లై చేసుకున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ క్లిప్‌ను మెకెన్నా తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేయగా ఇప్పటివరకూ 5 లక్షల మందిపైగా వీక్షించారు.
ఈ వైరల్ క్లిప్‌లో మెకెన్నా చిన్న బాటిల్స్‌ను ఓపెన్ చేస్తూ తన ముఖంపై మాయిశ్చరైజర్, ఇతర మేకప్ ప్రోడక్ట్స్‌ను అప్లై చేయడం కనిపిస్తుంది. మిడ్ ఎయిర్‌లో మేకప్ సెషన్‌కు ఒకరు ప్రయత్నించడం ఇదే ప్రధమం.
మీరు స్కిన్ కేర్ కోసం ఏం చేస్తారు..?!! పదివేల అడుగుల ఎత్తులో రిఫ్రెష్‌గా ఫీల్ అవడం, తాజాగా, తేమను కలిగిఉండటం కంటే మెరుగైన మార్గం లేదని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. మిడ్ ఎయిర్‌లో ఇలా చేయడం గొప్ప విషయమేనని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. గాలిలో విన్యాసాలు మెకెన్నాకు మాత్రమే సాధ్యమని కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More