Ustaad Bhagat Singh | టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ను ఫస్ట్ గ్లింప్స్ రూపంలో విడుదల చేసింది. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
గీతాసారాంశంలోని ఓ శ్లోకంతో గ్లింప్స్ వీడియో షురూ అవగా.. పవన్ వెనక పిస్లోల్ పెట్టుకొని మాస్ ఎంట్రీ ఇచ్చాడు. భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటున్నాడు పవన్ కల్యాణ్. గబ్బర్ సింగ్ పాత్రను డామినేట్ చేస్తూ.. డబుల్ మాస్ ట్రీట్ అందించేలా సినిమా ఉండబోతుందని గ్లింప్స్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో మరో మాస్ విజువల్ ట్రీట్ ఉండబోతుందని తాజా లుక్తో అర్థమవుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..
పవన్ కల్యాణ్ మరోవైపువినోదయ సీతమ్ రీమేక్తోపాటు హరిహరవీరమల్లు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు పవన్ కల్యాణ్. వీటికి సంబంధించిన కొత్త అప్డేట్స్ రావాల్సి ఉన్నాయి. సుజిత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఓజీ (OG) షూటింగ్ కూడా జెట్ స్పీడులో కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ ఒకదాని తర్వాత మరొక షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటూ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల చిత్రీకరణలో పాల్గొంటూ.. అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నట్టు తాజా స్టిల్ చెబుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ నయా లుక్..
A saviour with style and swag ❤️🔥
And we call him – #UstaadBhagatSingh 🔥🔥🔥
Get ready for the #UBSMassGlimpse today at 4.59 PM ❤️🔥❤️🔥❤️🔥@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/ad5ISFDbl2
— Mythri Movie Makers (@MythriOfficial) May 11, 2023