తండ్రికున్న ఆర్మీ క్యాప్ పెట్టుకొని…. సెల్యూట్ కొట్టి… వీడ్కోలు పలికిన కుమారుడు

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. మరణించిన సిబ్బందిలో వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ ఒకరు. ఆయన పార్థివ దేహాన్ని ఆర్మీ సిబ్బంది కుటుంబీకులకు అందజేశారు. పృథ్వీ సింగ్కు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడికి 9 ఏళ్లు. కుమార్తెకు 12 ఏళ్లు. అయితే తండ్రికి వారి కుటుంబం మొత్తం శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
తండ్రి చివరి చూపు కోసం, శ్రద్ధాంజలి ఘటించడం కోసం 9 ఏళ్ల కుమారుడు అవిరాజ్ పార్థివ దేహం దగ్గరికి వచ్చాడు. ఈ సమయంలో తండ్రి (వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్) తలపై ఉన్న ఆర్మీ టోపీని తీసుకొని, తన తలపై పెట్టుకొని, తండ్రికి సెల్యూట్ చేశాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే ఆయన కూతురు ఆరాధ్య కూడా ఉంది. ఆరాధ్య కూడా అదే పని చేసింది. ఈ సమయంలో వారిద్దరూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ టోపీని ధరించి తండ్రికి ఆఖరి సారిగా సెల్యూట్ చేసి, వీడ్కోలు పలికారు.
తండ్రి చివరి చూపు కోసం, శ్రద్ధాంజలి ఘటించడం కోసం 9 ఏళ్ల కుమారుడు అవిరాజ్ తండ్రి (వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్) తలపై ఉన్న ఆర్మీ టోపీని తీసుకొని, తన తలపై పెట్టుకొని, తండ్రికి సెల్యూట్ చేశాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. pic.twitter.com/NZAzjcYSGy
— Kamal (@itsmekkprasad) December 11, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

