Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
Delhi Police : ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న ఆందోళన విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు గురువారం వివరించారు.
Delhi Police : ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న ఆందోళన విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు గురువారం వివరించారు. సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం, అక్టోబర్ 16న భారీ నిరసనకు ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద ఉన్న సెంట్రల్ పార్క్లో లెహ్రా దో తిరంగా పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు దీప్కే ప్రకటించారు. దీనికోసం కార్యకర్తలు, దేశభక్తులు జాతీయ జెండాలతో రావాలని దీప్కే పిలుపునిచ్చారు.
అయితే, ఈ నిరసనను వ్యతిరేకిస్తూ ఢిల్లీకి చెందిన వ్యాపార సంఘం అయిన పలికా బజార్ వ్యాపారులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీజేపీ ఆందోళన వల్ల తమ వ్యాపారం దెబ్బ తింటుందని, తాము నష్టపోతామని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నితిన్ వాసుదేవ్ సంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు గురువారం ఢిల్లీ పోలీసులు బదులిచ్చారు.
సీజేపీ, ఆ పార్టీ ఫౌండర్ దీప్కే చేపట్టనున్న ఆందోళన విషయంలో తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. ఎలాంటి ఆందోళన తలెత్తకుండా, ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు కోర్టుకు హామీ ఇచ్చారు. తగిన నిఘా, భద్రత ఏర్పాటు చేశామని, అవసరమైతే దీప్కేపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టుకు పోలీసులు వివరించారు. ఇదే సమయంలో.. సీజేపీ, దీప్కే ఈ ఆందోళన చేపట్టకుండా చూడాలంటూ పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. వారు ఆందోళన చేయకుండా నిరోధించేలా తాము ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది.
అయితే, ఈ విషయంలో ఇప్పటికే తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చామని కోర్టు తెలిపింది. సీఈసీ రాజీనామా కోరుతూ సీజేపీ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను ఇప్పటికే సీజేపీ అగ్రనేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తిహార్ జైలుకు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

