సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే హన్స్‌రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన బంధువు కుమారుడికి అడ్మిషన్ ఇవ్వాలని ఓ పాఠశాల ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఒత్తిడి చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. కోటా రూల్స్‌కు విరుద్ధమని, అడ్మిషన్ ఇవ్వలేమని ప్రిన్సిపాల్ చెప్పడంతో చిర్రెత్తిపోయిన ఎమ్మెల్యే.. ‘నిన్ను ఆఫ్గానిస్థాన్ పంపిస్తా’ అంటూ అధికార దర్పంతో బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. కాగా, బెదిరించడం ద్వారా అడ్మిషన్ పొందలేరని ప్రిన్సిపాల్ ఘాటుగానే స్పందించారు.