న్యూఢిల్లీ: పర్యావరణ సమతూకాన్ని కాపాడే వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. గత 50 ఏండ్లలో వీటి సంఖ్య సగటున 73 శాతం తగ్గిపోయినట్టు వరల్డ్ వైల్డ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ నివేదిక పేర్కొంది.
భూమిపై జంతుజాతులు, పర్యావరణ వ్యవస్థలు క్షీణిస్తూనే ఉన్నాయని వెల్లడించింది. లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ (ఎల్పీఐ) వార్షిక నవీకరణ ప్రకారం 1970-2020 మధ్య పర్యవేక్షించిన పక్షులు, క్షీరదాలు, ఉభయచరాలు, చేపలు, సరీశృపాల పరిమాణం ప్రపంచ స్థాయిలో సగటున 73 శాతం తగ్గింది. మున్ముందు ఈ క్షీణత మరింత వేగంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.