రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఆయన ఇంట్లో కుటుంబసభ్యులు, సిబ్బందితో కలిపి మొత్తం 62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 24 మంది రిపోర్టులు శనివారం వెల్లడయ్యాయి. అందులో సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్, ఆయన ఇద్దరు కొడుకులు నితిన్ సోరెన్, విశ్వజిత్ సోరెన్, సీఎం మరదలు సరళ ముర్ము, ఒక బాడీగార్డు సహా మొత్తం 15 మందికి పాజిటివ్ వచ్చింది.
అయితే, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చింది. అయితే ఆయన ఇంట్లో కరోనా బారినపడిన 15 మంది ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని జార్ఖండ్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అందరూ హోమ్ ఐసోలేషన్‌లో ఉండి కరోనా చికిత్స పొందుతున్నారని చెప్పారు. మిగతా వారి రిపోర్టులు ఇవాళ వచ్చే అవకాశం ఉన్నది.