నిద్ర మాత్రలిచ్చి.. బెడ్‌పై విష సర్పాన్ని వదిలి
నిద్రమాత్రలిచ్చి, ఆపై బెడ్ మీదకు విషసర్పాన్ని వదిలి ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. తన ప్రియునితో కలసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ హత్యను ప్రమాదవశాత్తూ జరిగిన పాముకాటుగా చిత్రీకరించి, అతనిపై ఉన్న రూ. 20 లక్షల జీవిత బీమాను కాజేసేందుకు ఈ కుట్ర పన్నింది.
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య దామిని
- ఉత్తరప్రదేశ్‌లో ఘాతుకం
మీరట్: నిద్రమాత్రలిచ్చి, ఆపై బెడ్ మీదకు విషసర్పాన్ని వదిలి ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. తన ప్రియునితో కలసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ హత్యను ప్రమాదవశాత్తూ జరిగిన పాముకాటుగా చిత్రీకరించి, అతనిపై ఉన్న రూ. 20 లక్షల జీవిత బీమాను కాజేసేందుకు ఈ కుట్ర పన్నింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది. మీరట్ జిల్లాలోని హస్తినాపూర్‌లో తన భార్యతో పాటు అతుల్ పన్వార్ ఒక ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నాడు. ఈ కేసు గురించి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ) అవినాష్ పాండే మాట్లాడుతూ అతుల్ నడుపుతున్న స్కూలులో తుషార్ అనే వ్యక్తి గత మూడు నెలలుగా బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, దామినితో అతను వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడని దర్యాప్తులో తేలిందన్నారు. అతుల్ పన్వార్‌కు నిద్ర మాత్రలు ఇచ్చి, అతను స్పృహ కోల్పోయాక, అతను పడుకున్న మంచంపైకి దామినితో పాటు నిందితులు ఒక విష సర్పాన్ని వదిలారు.
ఈ ఘటనలో అతుల్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతని మృతిపై అనుమానం వ్యక్తం చేసిన అతుల్ కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. విచారణ సమయంలో పాము కాటు వల్ల సంభవించిన మరణం అయితే అది ప్రమాదవశాత్తూ జరిగినదిగా కనిపిస్తుందని, అందుకే తాము విషపూరితమైన పామును సేకరించామన్నారు. ఈ పామును నిందితులకు సోను, ఉదయ్ అనే పాములు ఆడించేవారు అందించినట్లు దర్యాప్తులో తేలింది. విచారణ సమయంలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. కాగా ఈ హత్య వెనుక రెండు కారణాలున్నాయని, అతుల్‌ను తొలగించుకుని తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని దామిని, తుషార్ భావించారని, అలాగే అతుల్ మరణాన్ని పాము కాటుతో జరిగినదిగా చిత్రీకరిస్తే, తమకు అతనిపై ఉన్న రూ. 20 లక్షల బీమా మొత్తం అందుతుందని నిందితులు భావించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

