‘ఎస్పీ’ ఎవరు?… సోనియా వద్దకు గెహ్లాట్ తీసుకెళ్లిన రహస్య నోట్ ఫొటో లీక్
గెహ్లాట్ చేతిలో ఉన్న రహస్య నోట్‌ను మలయాళ మనోరమ ఫొటోగ్రాఫర్ సురేష్ జయప్రకాష్ ఫొటో తీశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్దకు ఆయన తీసుకెళ్లిన రహస్య నోట్ ఫొటో లీక్ అయ్యింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ పోటీ నేపథ్యంలో సచిన్ పైలట్‌ను సీఎంగా చేస్తారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే దీనిని అడ్డుకునేందుకు గెహ్లాట్‌కు మద్దతుగా ఉన్న వంద మందికిపై ఎమ్మెల్యేలు గత ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే గురువారం సోనియా గాంధీని కలిసిన గెహ్లాట్ ఈ పరిణామాలపై క్షమాపణలు చెప్పారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్నారు.
కాగా, సోనియా గాంధీతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ పరిణామాలపై సోనియాకు క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అయితే గెహ్లాట్ చేతిలో ఉన్న రహస్య నోట్‌ను మలయాళ మనోరమ ఫొటోగ్రాఫర్ సురేష్ జయప్రకాష్ ఫొటో తీశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సోనియా వద్దకు అశోక్ గెహ్లాట్ తీసుకెళ్లిన ఆ నోట్లో ప్రత్యేకంగా సచిన్ పైలట్‌ను ‘SP’గా పేర్కొంటూ ఆయన పలు ఆరోపణలు చేశారు. తనకు 102 ఎమ్మెల్యేల మద్దతు ఉండగా ‘SP’ వెంట 18 మంది ఉన్నారని అందులో తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ‘SP’ పార్టీని వీడవచ్చని అందులో పేర్కొన్నారు.
అలాగే సచిన్ పైలట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని, ఎమ్మెల్యేలను కొనేందుకు 10 నుంచి 50 కోట్లు ఆఫర్ చేసినట్లు అశోక్ గెహ్లాట్ ఆ నోట్లో ఆరోపించారు. తన మద్దతుదారులు ప్రత్యేకంగా సమావేశం కావడం చాలా విచారకరమని, ఇది తనకు చాలా బాధ కలిగించిందని అందులో పేర్కొన్నారు. ‘‘SP’- పార్టీని వీడుతారు. పరిశీలకులు దీనిపై గతంలోనే రిపోర్ట్ ఇచ్చి ఉంటే పార్టీకి చాలా మంచిది’ అని కూడా ఆ నోట్లో ప్రస్తావించారు. దీంతో అశోక్ గెహ్లాట్‌కు సచిన్ పైలట్‌పై ఉన్న వ్యతిరేకత మరోసారి బయటపడింది.
https://twitter.com/EgiyeBangla2022/status/1575723528812658690?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1575723528812658690%7Ctwgr%5Ea18aaad365acfb74cfb8166a9474807476a8709a%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fphoto-reveals-ashok-gehlots-cheat-sheet-for-meeting-with-sonia-gandhi-3393546
“SP will leave party”
Who is SP that Ashok Gehlot’s “leaked note” ((deliberately visible note)) speaks of ?
Congress Jodo… Bharat to Juda hua hai ji 🙏 pic.twitter.com/ZncFLJf4to
— Shehzad Jai Hind (@Shehzad_Ind) September 30, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

