ఎవరీ నూపుర్ శర్మ.. ఇవీ ఆమె వివరాలు
న్యూఢిల్లీ: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నూపుర్ శర్మ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. ఇస్లాం మత వ్యవస్థాపకుడు ప్రవక్తపై ఆమె ఓ టీవీ చర్చలో అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదాన్ని రేపారు. ఆరబ్ దేశాలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రతినిధిగా ఉన్న నూపుర్‌పై ఆ పార్టీ వేటు వేసింది. నూపుర్ శర్మ ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఢిల్లీ వర్సిటీ నుంచే ఆమె ఎల్ఎల్బీ చదివారు. ఇక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆమె లా సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యారు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమె పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ యువమోర్చాలో అనేక కీలక హోదాల్లో పనిచేశారు. 2017లో ఢిల్లీ బీజేపీ అధికారి ప్రతినిధిగా ఆమెను నియమించారు. 2020 సెప్టెంబర్‌లో జేపీ నడ్డా బృందంలోకి ఆమె వెళ్లారు. జాతీయ అధికార ప్రతినిధిగా ఆమెను నియమించారు. టీచ్ ఫర్ ఇండియా యూత్ అంబాసిడర్‌గా ఆమె కొనసాగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

