న్యూఢిల్లీ: ఢిల్లీ కారు బాంబు పేలుడులో సూత్రధారిగా డాక్టర్ ఉమర్ మహమ్మద్(Dr Umar Mohammad)ను భద్రతాధికారులు అనుమానిస్తున్నారు. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ వద్ద పేలిన కారులో అతనే ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. బహుషా అతను ఆత్మహుతి దాడికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హుందయ్ ఐ20 తెలుపు రంగు కారులో అతను ప్రయాణించాడు.
ఎవరీ ఉమర్ మహ్మద్.. డాక్టర్ నుంచి టెర్రరిస్టుగా ఎలా?
డాక్టర్ ఉమర్ మహమ్మద్ 1989 ఫిబ్రవరి 24వ తేదీన జన్మించాడు. పుల్వామాలోని కోయిల్ గ్రామం అతనిది. తండ్రి జీహెచ్ నబీ భట్, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేసి 10 సంవత్సరాల క్రితం ఉద్యోగం మానేసినట్లు సమాచారం. తల్లి షమీమా బానొ, గృహిణి. శ్రీనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉమర్ ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశాడు. అనంతనాగ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొన్నాళ్లు సీనియర్ రెసిడెంట్‌గా పని చేసిన అనంతరం పరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ వైద్య విభాగంలో అసిస్టెంట్ ఫొఫెసర్గా చేరాడు. అక్కడ పనిచేస్తున్నపటినుంచి సోషల్ మీడియా ద్వారా టెర్రర్ భావజాలానికి డాక్టర్ ఉమర్ ఆకర్సితులైనట్లు తెలుస్తోంది.
పుల్వామాకు చెందిన ఈ డాక్టర్.. ఫరీదాబాద్‌లో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అక్కడ బయటపడిన టెర్రర్ మాడ్యూల్తో అతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన టెర్రర్ ఆపరేషన్‌లో పలువురు డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో అదీల్ అహ్మద్ రాథర్, ముజామిల్ షకీల్ అనే డాక్టర్లు ఫరీదాబాద్‌లో ఉన్న అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో ఉమర్‌తో పాటు కలిసి పనిచేశారు. ఆ ఇద్దరి డాక్టర్లతో ఉమర్‌కు సంబంధాలు ఉన్నట్లు భద్రతాధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇదంతా తెలుసుకున్న ఉమర్ ఎక్కడ దొరికిపోతానేమోనన్న భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటారని అనుకుంటున్నారు.
ఉమర్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు : మేన కోడలు
చిన్నప్పటి నుంచి కూడా ఉమర్ పుస్తకాల పురుగు అని అతని మేన కోడలు ముజామిల్ చెబుతున్నారు. ఉమర్ ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతాడని చెప్పింది. చిన్నతనం నుంచి అతను అంతర్ముఖుడే. అతనికి ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు. కేవలం స్టడీస్, వర్క్ మీదనే అతను ఫోకస్ చేసేవాడని మేనకోడలు తెలిపింది.
ఫరీదాబాద్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేస్తున్నట్లు పేర్కొన్నది. శుక్రవారం ఫోన్ చేశాడని, పరీక్షల వల్ల బిజీగా ఉన్నానని, మూడు రోజుల తర్వాత ఇంటికి రానున్నట్లు చెప్పాడు. చిన్నప్పటి నుంచి రిజర్వ్‌గా ఉండే వ్యక్తి అని ముజామిల్ పేర్కొన్నది. ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తి కాదు అని ఆమె స్పష్టం చేసింది. ఉమర్‌ను చదివించేందుకు చాలా కష్టపడ్డామని, కానీ దీన్ని నమ్మలేకపోతున్నట్లు ఆమె చెప్పింది. రెండు నెలల క్రితం చివరి సారి కశ్మీర్‌ను విజిట్ చేసినట్లు ఆమె తెలిపింది.