భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ ( COVAXIN ) టీకాపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, వైట్‌హౌజ్ ముఖ్య వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. 617 కొవిడ్ వేరియంట్లపై ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని కితాబిచ్చారు. ఇటీవల కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారి సమాచారాన్ని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. భారత్‌లో కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత తొందరగా జరిగితే కరోనా నుంచి భారత్ అంత త్వరగా బయటపడుతుందని పేర్కొన్నారు. అన్ని రకాల వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనే శక్తి కోవాగ్జిన్ ( COVAXIN ) వ్యాక్సిన్‌కు ఉందని న్యూయార్క్ టైమ్స్ కూడా ఇటీవల ప్రశంసలు కురిపించింది.
కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలం అవుతున్న భారత్‌కు సహకరించడంలో ధనిక దేశాలు విఫలమయ్యాయని ఆంటోనీ ఫౌచీ ఆరోపించారు. ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్ కొరతతో ప్రజలు మరణిస్తున్న విపత్కర పరిస్థితులు భారత్‌లో నెలకొన్నాయని ఆయన అన్నారు. భారత్‌లో నెలకొన్న ఈ పరిస్థితులు అంతర్జాతీయ అసమానతలకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇక కరోనా పోరులో భారత్‌కు అవసరమైన సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. వ్యాక్సిన్ ముడిపదార్థాల విషయంలో భారత్‌కు అండగా ఉంటామని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్-19 కలకలం : కేంద్రం కీలక నిర్ణయం
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకూ సిద్ధపడాల్సిందే: కేంద్రమంత్రి
వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లకు శుభవార్త.. ఇక మాస్కులు లేకుండా తిరగొచ్చు
నిర్లక్ష్యంతో నా భార్యను బలిగొన్నారు : ఎస్ఐ వైరల్ వీడియో