న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ట్విట్టర్ సంస్థలో భారత ప్రభుత్వం ఓ ఏజెంట్‌ను (గూఢచారిని) నియమించిందని ఆ కంపెనీ భద్రతా విభాగ మాజీ సీఈవో, విజిల్‌బ్లోయర్ పీటర్ మడ్గే జాట్కో వెల్లడించాడు. అమెరికా సెనేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన ఈ విషయాన్ని చెప్పాడు.
ఓ వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకోవాల్సిందిగా ట్విట్టర్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని గత నెలలో సంచలన ఆరోపణ చేసిన జాట్కో.. తన ఫిర్యాదుపై మంగళవారం అమెరికా సెనేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. సెన్సార్‌షిప్‌కు సంబంధించి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లను అంగీకరించేందుకు ట్విట్టర్ సుముఖంగా ఉన్నదో లేదో తెలుసుకోవడంతోపాటు కంపెనీ ప్రణాళికల గురించి మెరుగ్గా అవగాహన చేసుకొనేందుకు భారత్ ఆ ఏజెంట్‌ను నియమించిందని తెలిపారు.