న్యూఢిల్లీ, జూన్ 1: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో లోపం బయటపడింది. వ్యక్తిగత, గ్రూప్ చాట్‌లో షేర్ అవుతున్న ఒక లింక్‌ను క్లిక్ చేస్తే వాట్సాప్ యాప్ క్రాష్ అవుతున్నట్టు ఓ వ్యక్తి గుర్తించి ట్వీట్ చేశాడు. వాట్సాప్ బిజినెస్ అకౌంట్లు సహా అన్ని రకాల వాట్సాప్ యాండ్రాయిడ్ యాప్ వెర్షన్లలో ఇలా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. wa.me/setting అనే లింక్ ద్వారా ఇలా జరుగుతున్నది.
సాధారణంగా ఈ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ యాప్ సెట్టింగ్స్ పేజీ ఓపెన్ కావాలి. కానీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ యాప్ క్రాష్ అయిపోతున్నది. అయితే, తర్వాత మళ్లీ యాప్ సాధారణంగానే రీస్టార్ట్ అవుతున్నది. కాగా, ఈ లోపాన్ని వాట్సాప్ సంస్థ సరి చేసిందని లోపాన్ని కనుగొన్న వ్యక్తే మళ్లీ ట్వీట్ చేశాడు.