న్యూఢిల్లీ: వాట్సాప్ సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. క్లోన్డ్ యాప్ అవసరం లేకుండా ఒకే ఫోన్లో రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించే వెసులుబాటు కల్పించింది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినవారు వాట్సాప్ అకౌంట్లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ వద్ద ఉన్న బాణం గుర్తుపై నొక్కి మరో అకౌంట్‌ను యాడ్ చేసుకోవచ్చు. దీంతో వేరే ఖాతాకు మారొచ్చు. ఒక ఖాతాలో ప్రైవేట్ చాట్, మరో ఖాతాలో బిజినెస్‌కు సంబంధించిన చాట్ చేసుకొనే వీలుంటుంది. త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు వాట్సాప్ వెల్లడించింది.