Amritpal Singh: 80 వేల మంది పోలీసులున్నారు.. అమృత్‌పాల్ ఎలా తప్పించుకున్నాడు?
Amritpal Singh: అమృత్‌పాల్ ఎలా తప్పించుకున్నాడు. 80 వేల మంది పోలీసులు ఉన్నా అది ఎలా సాధ్యమైంది.. ఇది మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటూ పంజాబ్ కోర్టు ఇవాళ స్థానిక ప్రభుత్వాన్ని నిలదీసింది.
చండీఘడ్: ఖలీస్తానీ(Khalistani) గ్రూపు వార్సీ పంజాబ్ దే(Waris Punjab De) నేత అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh)ను అరెస్టు చేసేందుకు పంజాబీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 80 వేల మంది పోలీసుల కన్నుగప్పి ఎలా అమృత్‌పాల్ తప్పించుకున్నట్లు ఇవాళ పంజాబ్ హైకోర్టు ప్రశ్నించింది. ఆ ఆపరేషన్‌పై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. 80 వేల మంది పోలీసులున్నారు.. మీరేం చేస్తున్నారు, అమృత్‌పాల్ సింగ్ ఎలా ఎస్కేప్ అయ్యారని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర పోలీసుల ఇంటెలిజెన్స్ విఫలమైనట్లు(Intelligence failure) కోర్టు పేర్కొన్నది.
అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేయాలని శనివారం ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పంజాబ్ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ఖలిస్తానీ నేత అమృత్‌పాల్‌కు చెందిన 120 మంది మద్దతుదారుల్ని(supporters) అరెస్టు చేసినట్లు చెప్పారు. అమృత్‌పాల్ గత కొన్నేళ్ల నుంచి పంజాబ్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. సాయుధ మద్దతుదారులతో ఆయన ఎప్పుడూ తిరుగుతుంటాడు. వేర్పాటువాద(separatist) నేత జర్నెల్ సింగ్ బింద్రేవాలా బాటలో నడుస్తున్నట్లు ఆయన పలుమార్లు చెప్పారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను భగ్నం చేయాలనుకునేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇవాళ సీఎం భగవంత్‌మాన్ సింగ్(CM Bhagwanth Mann) తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తినీ సహించబోమన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు శాంతిని, ప్రగతిని ఆశిస్తున్నట్లు మాన్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

