న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 32-బిట్ ప్రాసెసర్ ‘విక్రమ్’ను కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఢిల్లీలో నిర్వహించిన సెమికాన్ ఇండియా 2025లో మంగళవారం ఆవిష్కరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన ఈ చిప్‌ను అంతరిక్ష వాహక నౌకలలో ఉపయోగించనున్నారు.
అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొనేలా ఈ చిప్‌ను రూపొందించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రభుత్వ ఆమోదిత ప్రాజెక్టులకు చెందిన మరో నాలుగు టెస్ట్ చిప్స్‌ను కూడా ప్రవేశపెట్టారు.