Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం క్రాష్‌కు కొద్ది క్షణాల ముందే.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఆ పైలట్ మేడే(MAYDAY) కాల్ ఇచ్చినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. తక్షణం ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిసినా.. లేక ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చినా.. పైలట్లు ఏటీసీకి మేడే కాల్ చేస్తారు . మేడే.. మేడే .. అంటూ పైలట్లు.. తమకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఏటీసీకి వివరిస్తారు.
పైలట్ మేడే సంకేతాన్ని పంపించారంటే.. విమానం లేదా దానిలోని ప్రయాణికులకు ప్రాణాంతక పరిస్థితి ఏర్పడిందని అర్థం చేసుకోవాలి. విమాన ప్రయాణాల్లో పైలట్లు మేడే (MAYDAY) అని చెప్పడం అంటే విమానం తీవ్రమైన ప్రమాదంలో ఉందని లేదా అత్యవసర స్థితిని సూచించే అంతర్జాతీయ రేడియో దిస్ట్రెస్ సిగ్నల్. ఈ పదం ఫ్రెంచ్ పదం m’aider (మీ ఆయిదర్) నుండి వచ్చింది. దీని అర్థం “నాకు సహాయం చేయండి” అని విమానయాన నిపుణులు చెబుతున్నారు.