డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే ఎటు?.. ఇండియా కూటమి నుంచి నిష్క్రమించడంతో సర్వత్రా ఉత్కంఠ
నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టేందుకు రాజ్యాంగ సవరణ కోసం కొత్త బిల్లును తీసుకురావడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఒకవేళ తీసుకువచ్చిన పక్షంలో లోక్సభలో 22 మంది సభ్యులు, రాజ్యసభలో 8 మంది సభ్యులు ఉన్న డీఎంకే వైఖరి పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టేందుకు రాజ్యాంగ సవరణ కోసం కొత్త బిల్లును తీసుకురావడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఒకవేళ తీసుకువచ్చిన పక్షంలో లోక్సభలో 22 మంది సభ్యులు, రాజ్యసభలో 8 మంది సభ్యులు ఉన్న డీఎంకే వైఖరి పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదాస్పద బిల్లుకు లోక్సభలో ఆమోదం పొందడం ప్రభుత్వానికి కష్టతరం కానున్నది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చి కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఇండియా కూటమి నుంచి వెలుపలకు వచ్చిన డీఎంకే రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడంపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
అయితే కొత్త బిల్లును పరిశీలించిన తర్వాతే తన ఆలోచనను బయటపెడతానని ఆ పార్టీ స్పష్టం చేసింది. తాము కాంగ్రెస్తో పనిచేయకపోవచ్చేమో కాని ప్రతిపక్ష పాత్రను మాత్రం వదిలిపెట్టలేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. వందేమాతరం బిల్లు, పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించిన బిల్లుపై సవరణలు ప్రతిపాదించడం ద్వారా, అలాగే వాటికి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా తాము తమ వైఖరిని చాటుకున్నామని వారు గుర్తుచేస్తున్నారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నిరసనలో భాగంగా డీలిమిటేషన్ బిల్లు ప్రతిని ఇప్పటికే దహనం చేసినందున ఆ పార్టీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయదని ఇండియా కూటమిలోని పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

