దేశమా లేక మతమా? ఏది సర్వోన్నతం.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
చెన్నై: దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కర్నాటకలో హిజబ్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో .. ఇవాళ ఓ పిల్‌పై హైకోర్టు యాక్టింగ్ సీజే ఎంఎన్ భండారి స్పందిస్తూ.. దేశం ముఖ్యమా లేక మతమా అని ఆయన ప్రశ్నించారు. ఏది సర్వోన్నతమని ఆయన అడిగారు. డ్రెస్ కోడ్‌కు సంబంధించిన పిల్‌పై ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఆ సమయంలో సీజే భండారి షాక్ వ్యక్తం చేశారు. కొందరు హిజబ్ వేసుకుంటున్నారు, కొందరు టోపీలు ధరిస్తున్నారు, కొందరు వారికి నచ్చిన దుస్తులు వేసుకుంటున్నారని, ఇంతకీ ఇది ఒకే దేశమా లేక మతం ఆధారంగా విభజనకు గురైందా లేక ఇంకామైనానా అని ఆయన ప్రశ్నించారు. ఇది సర్ప్రైజింగ్గా ఉందన్నారు.
భారత్ సెక్యులర్ దేశమని, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, దేశాన్ని మతం ఆధారంగా విభజించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోందని యాక్టింగ్ సీజే అన్నారు. తిరుచురాపల్లి జిల్లాకు చెందిన రంగరాజన్ నరసింహన్ అనే వ్యక్తి పిల్ వేశారు. ఆ పిల్‌ను మద్రాస్ హైకోర్టు విచారించింది. ఆలయాలకు వెళ్లే భక్తులకు కఠినమైన డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని, హిందువులు కాని వారికి ఆలయ ప్రవేశాన్ని నిషేధించాలని ఆ పిల్లో కోరారు. హిందువులు కానివారిని ఆలయాలకు రాకుండా చేసేందుకు గుళ్ల వద్ద డిస్ప్లే బోర్డులు పెట్టాలన్నారు. అయితే నిర్ధిష్టమైన డ్రెస్ కోడ్ లేనప్పుడు ఎలా డిస్ప్లే బోర్డులు పెడుతారని ధర్మాసనం ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rapthadu accused | ఆసుపత్రి నుంచి రాప్తాడు నిందితుడు డిశ్చార్జ్ ..అనంతపురం జిల్లా జైలుకు తరలింపు
సీఐటీయూ కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి పదవికి పిచ్చేటి శివ రాజీనామా
Shaina NC | బాల్ థాకరే ఫొటోను చింపేసిన శివసేన నాయకురాలు షైనా ఎన్సీ.. రాజకీయంగా తీవ్ర దుమారం..!
Wall Collapse | కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్.. వీడియో
Panchayat Season 5 | ఫులేరా గ్రామానికి మళ్లీ స్వాగతం.. కొత్త సీజన్‌తో రాబోతున్న ‘పంచాయత్’
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

