ముంబై: ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న గరీబ్ నగర్ మురికివాడలో అక్రమ నిర్మాణాల తొలగింపు(Demolition Drive) ప్రక్రియ కొనసాగుతోంది. పశ్చిమ రైల్వే శాఖ దీనిపై ఇవాళ అప్డేట్ ఇచ్చింది. అయితే ఆక్రమణకు గురైన రైల్వే భూములను మళ్లీ చేజిక్కించుకునేందుకు రైల్వేశాఖ డెమోలిషన్ డ్రైవ్ చేపట్టింది. నిర్మాణాల కూల్చివేతను అడ్డుకుంటున్న నిరసనకారులను అరెస్టు చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే రైల్వే ప్రాజెక్టుల కోసం ఆక్రమణకు గురైన భూములను మళ్లీ స్వాధీనం చేసుకుంటున్నామని వెస్ట్రన్ రైల్వే శాఖ తన ఎక్స్ అకౌంట్లో ఇవాళ వెల్లడించింది. చాలా స్మూత్‌గా ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పింది. ఇక శిథిలాల తొలగింపు ప్రక్రియ కూడా జరుగుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. కూల్చివేతలు, తొలగింపులకు చెందిన వీడియో, ఇమేజ్‌లను వెస్ట్రన్ రైల్వే తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. హింసాత్మక ఆందోళనలకు దిగిన వారిపై ముంబై పోలీసులు కొరఢా రుళిపిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 19 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.
On-ground debris clearance continues as vital Railway land is reclaimed 🚉
With the demolition drive continuing near Bandra station, debris clearance is progressing simultaneously as illegally occupied Railway land is being systematically reclaimed for future railway… pic.twitter.com/3PB4yi0rOG
— Western Railway (@WesternRly) May 22, 2026