న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ‘ఆరోగ్యంతో ఎయిమ్స్ నుంచి వెళ్తున్నా. ఎయిమ్స్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని ఎంతో అభినందిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
ఇటీవల అస్వస్థతకు గురైన బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్ ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మలేరియా సోకినట్లు వైద్య పరీక్షలో నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందించారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు పలువురు బీజేపీ నేతలు ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయనను కలిసి ఆరోగ్యంపై ఆరా తీశారు.
Grateful to Dr Randeep Guleria, Director #aiimsdelhi & Dr @neerajnischal ,his dedicated team for effectively & comprehensively addressing health issues.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) October 28, 2021
Leaving AIIMS in a state of fitness.
Greatly appreciate professionalism by AIIMS Doctors & Nursing Staff. Very commendable. pic.twitter.com/X1f17Qx5Pr