బెంగాల్ ఎన్నికలు: ఓటు వేసిన గవర్నర్ దంపతులు
West Bengal Governor: బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, ఆయన సతీమణి సుధేశ్ ధన్కర్ కోల్‌కతాలోని చౌరింగి ఏరియాలోగల ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఉదయం ఆ రాష్ట్ర గవర్నర్ దంపతులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, ఆయన సతీమణి సుధేశ్ ధన్కర్ కోల్‌కతాలోని చౌరింగి ఏరియాలోగల ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ ధన్కర్ ఎన్నిక అనేది ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పండుగ అని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కొవిడ్ నిబంధనలను వందకు వంద శాతం అమలు చేస్తున్నారని, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ చేసిన ఏర్పాట్లు భేష్ అని ఆయన కొనియాడారు.
కాగా, బెంగాల్లో మొత్తం ఎనిమిది విడుతల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ తుది విడుత పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 35 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 283 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. మే 2న పశ్చిమబెంగాల్‌తోపాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
నమ్మలేని నిజం: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భర్త..!
రష్యా నుంచి భారత్‌కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి
టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు
ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

