కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లా, భలూకా రోడ్ యార్డులో గురువారం వర్షాల వల్ల రైలు పట్టాలు దెబ్బతినడంతో, ఆ పట్టాలపై ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురి కాకుండాసాహసోపేతంగా కృషి చేసిన పన్నెండేళ్ల బాలుడికి సర్టిఫికేట్, నగదు బహుమతిని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అందజేసింది.
ముర్సలిన్ షేక్ (12), మరో రైల్వే ఉద్యోగితో కలిసి తన ఎరుపు రంగు చొక్కాను ఎగురవేయడంతో ఆ ప్యాసింజర్ రైలులోని లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి, ప్రమాదం జరగకుండా నివారించారని తెలిపింది. ఉత్తర మాల్డా ఎంపీ ఖగెన్ ముర్ము , డివిజినల్ రైల్వే మేనేజర్ సురేంద్ర కుమార్ ఆ బాలుడి ఇంటి వద్ద ఈ పురస్కారాన్ని అందజేశారు.