Konark Wheel: జీ20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా కోణార్క్ వీల్
Konark Wheel: జీ20 సదస్సులో కోణార్క్ వీల్.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారత్ మండపంలో ఆ వీల్‌ను ఏర్పాటు చేశారు. ఆ మండపానికి వచ్చే అతిథులను ప్రధాని మోదీ అక్కడే గ్రీట్ చేయనున్నారు. వెల్కమ్ హ్యాండ్‌షేక్ ఇచ్చే ప్రదేశంలోనే బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ కోణార్క్ వీల్‌ను ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: జీ20 సమావేశాలు ఇవాళ ప్రారంభం అవుతున్నాయి. అయితే వివిధ దేశాధినేతలు ఆ సదస్సుకు హాజరవుతున్నారు. అన్ని దేశాధినేతల్ని ప్రధాని మోదీ కలుసుకోనున్నారు. అయితే లీడర్లను ఆహ్వానించే ప్రదేశంలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌పై భారీ కోణార్క్ వీల్(Konark Wheel)ను ముద్రించారు. కోణార్క్ వీల్ వద్దే వివిధ దేశాధినేతల్ని ప్రధాని మోదీ ఆహ్వానించారు. వెల్కమ్ హ్యాండ్‌షేక్ ఇవ్వనున్నారు. ఒడిశాకు చెందిన కోణార్క్ వీల్ .. అతిథుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. 13వ శతాబ్ధంలో ఒకటో నర్సింహదేవ రాజు కోణార్క్ వీల్‌ను నిర్మించారు. ఈ చక్రం ఆధారంగానే జాతీయ జెండాలో 24 చువ్వలు ఉన్న వీల్‌ను పొందుపరిచారు. భారతీయ ప్రాచీన సంస్కృతి, నాగరికత, వాస్తు కళకు ఆ చక్రం ప్రతిబింబంగా నిలువనున్నది. కోణార్క్ వీల్లో ఉన్న రొటేషన్ మోషన్.. కాలచక్రానికి సంకేతంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యం ఆదర్శాలు, నిబద్ధతకు ఈ చిహ్నం శక్తివంతంగా నిలుస్తుందని చెబుతున్నారు. సమావేశాలకు హాజరవుతున్న ప్రతినిధుల కోసం ప్రత్యేక కోణార్క్ వీల్ బ్యాడ్జీలను అందిస్తున్నారు.
#WATCH | G 20 in India: President of South Korea Yoon Suk Yeol arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/7q5wGgxqR6
— ANI (@ANI) September 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

