పీవీకి భారతరత్నను స్వాగతిస్తున్నా: సోనియా
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రదానం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వాగతించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రదానం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వాగతించారు. శుక్రవారం ప్రభుత్వ నిర్ణయంపై ఆమెను ప్రశ్నించగా తప్పకుండా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. మాజీ ప్రధానులు పీవీ, చరణ్‌సింగ్, హరిత విప్లవానికి మార్గదర్శకుడైన ఎంఎస్ స్వామినాథన్ భారత్‌కే రత్నాలని, దేశ ప్రగతిలో వారి సహకారం అపూర్వమైనది, భారతీయులందరూ వారిని గౌరవించారని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం పేర్కొన్నది. అయితే స్వామినాథన్ ఫార్ములా ఆధారంగా రైతులకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హోదా కల్పించడంపై మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని తప్పు పట్టింది. కాగా, తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావుకు భారతరత్న దకడం గర్వించదగ్గ విషయమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పీవీకి భారతరత్న రావడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

