చెన్నై: పత్తలి మక్కల్ కచ్చి(పీఎంకే) వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయన కుమారుడు అన్భుమణి రాందాస్(Anbumani Ramadoss)ను తొలగించినట్లు ప్రకటించారు. అన్ని పోస్టుల నుంచి అన్భుమణిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తండ్రి ఆరోపించారు. కుమారుడిని కలుపు మొక్కతో పోల్చారు. కుటుంబంలో చెలరేగిన చిచ్చును చల్లార్చేందుకు అన్భుమణి పలుమార్గాల్లో ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.
అన్భుమణిపై ఉన్న 16 ఆరోపణలకు సమాధానం ఇవ్వడం విఫలమైనట్లు ఆరోపించారు. తైలపురంలో ఉన్న ఫార్మ్హౌజ్లో జరిగిన భేటీ తర్వాత సీనియర్ రాందాస్ ఈ ప్రకటన చేశారు. పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్గా మాత్రమే కాదు, అతన్ని పార్టీ నుంచి పూర్తిగా వెలి వేస్తున్నట్లు సీనియర్ రాందాస్ తెలిపారు. అన్బుమణి అనే కలుపు మొక్కను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు.16 అభియోగాలపై వివరణ ఇవ్వాలని అన్భుమణికి షోకాజు నోటీసులు ఇచ్చమన్నారు. కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ, లిఖితపూర్వకంగా కానీ సమాధానం ఇవ్వలేదన్నారు.