న్యూఢిల్లీ : పెళ్లంటే.. ఫొటోషూట్లు, వీడియో సాంగ్స్ ఇప్పుడు కామనైపోయింది. మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తిండిపోయేలా ఉండేందుకు వధువరులు కూడా డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేస్తున్నారు. అయితే ఈ వరుడు ఫొటో గ్రాఫరే కావడంతో కాస్త డిఫరెంట్‌గా ఆలోచించినట్లున్నాడు. అందుకే తన పెళ్లిలో వధువు ఫొటోలను డిఫరెంట్ యాంగిల్స్‌లో క్లిక్‌మనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో (Viral Video) ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది.
ఫొటోగ్రాఫర్ ఆయన్ సేన్.. ప్రియతో ఏడడుగులు నడిచి ఆపై కెమెరాను అందుకున్నాడు. పర్ఫెక్ట్ లైటింగ్‌తో వధువు ఫొటోలు తీశాడు. ఈ వీడియోను స్లైన్ ఫోటో-గ్రాఫిక్స్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 32 లక్షల వ్యూస్ లభించాయి. నూతన దంపతులను అభినందిస్తూ పెద్దసంఖ్యలో ఇన్‌స్టా యూజర్లు కామెంట్స్ సెక్షన్‌ను నింపేశారు.
Read More