లక్నో: పెళ్లి బృందంలోని వ్యక్తిని స్థానికులు దొంగగా అనుమానించారు. అతడ్ని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. (Man Tied To Pole Beaten) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని రక్షించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి బృందం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ వ్యక్తిని ఇంటికి తీసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి గోరఖ్‌పూర్‌కు చెందిన పెళ్లి బృందం ఊరేగింపుగా డియోరియా జిల్లా తార్కుల్వా గ్రామంలోని పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నది.
కాగా, పెళ్లి బృందంలోని ఒక వ్యక్తి మద్యం సేవించాడు. ఒంటరిగా ఆ గ్రామంలో తిరిగాడు. దారి తప్పిన అతడు అర్ధరాత్రి వేళ ఒక ఇంటి తలుపుతట్టాడు. అయితే ముందు రోజు ఆ ప్రాంతంలో చోరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని దొంగగా ఇంటి వారు అనుమానించారు. దొంగ, దొంగ అని అరిచారు. దీంతో స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఆ వ్యక్తిని పట్టుకున్నారు. బలవంతంగా విద్యుత్ స్థంభానికి కట్టేసి కొట్టారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి కాపాడి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడి గాయాలకు చికిత్స చేశారు. మరునాడు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అతడ్ని తమ వెంట తీసుకెళ్లారు. కాగా, ఆ వ్యక్తిని దొంగగా అనుమానించి స్తంభానికి కట్టేసి కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#देवरिया के पथरदेवा कस्बे में बुधवार रात गोरखपुर से आई एक बारात के दौरान, नशे की हालत में एक युवक रास्ता भटक गया। स्थानीय लोगों ने उसे चोर समझकर पकड़ लिया और बुरी तरह पीटा। @DeoriaPolice pic.twitter.com/lGkxrUT6QV
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) November 30, 2024