న్యూఢిల్లీ: త్వరలోనే జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు ఎన్నికల సంఘం కమీషనర్ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) వెల్లడించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో హింస జరగదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలు అవసరం లేదని, అధికారులు, ఏజెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు, అబ్జర్వర్లతో పాటు ప్రజలు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంటారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.