న్యూఢిల్లీ, మార్చి 23 : కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీ సీఎంగా పాలన చేస్తారని, ఇందు కోసం జైల్లో కార్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు నుంచి అనుమతి తీసుకొంటామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు. ‘జైలు నుంచి పరిపాలన చేయకూడదని ఎక్కడా చెప్పలేదు. జైలు కెళ్లినంత మాత్రాన నేరస్థుడు కాదని చట్టం చెబుతున్నది’ అని పేర్కొన్నారు. ఆప్‌లో కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాన్ అన్నారు.