కాగ్ అడిగిన డేటా ఇవ్వండి.. ప్రభుత్వ శాఖలకు మోదీ సూచన

న్యూఢిల్లీ: ఆడిట్ దివస్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన కాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవలం కొన్ని సంస్థలు మాత్రమే మరింత బలోపేతం అయ్యాయని, మరింత పరిణితి సాధించాయని, సమయంతో పాటు అవి మరింత కీలకంగా మారినట్లు ప్రధాని మోదీ అన్నారు. చాలా వరకు సంస్థలు కొన్ని దశాబ్ధాల తర్వాత తమ ఉనికిని కోల్పోతాయని, కానీ కాగ్ మాత్రం వారసత్వంగా మారిందని, ప్రతి జనరేషన్ దాన్ని స్పర్శిస్తోందని, కాగ్‌పై బాధ్యతలు పెరిగినట్లు ప్రధాని అన్నారు. ఒకప్పుడు అనుమానంతో, భయంతో ఆడిటింగ్‌ను చూసేవారని, కాగ్ వర్సెస్ గవర్నమెంట్ అన్న మైండ్‌సెట్ ఉండేదని, ప్రతి అంశంలోనూ కాగ్ తప్పుల్ని వెతుకుతుందని అధికారులు భావించేవారని, కానీ ప్రస్తుతం ఆ మైండ్‌సెట్ మారిందని, ఈ రోజుల్లో ఆడిట్‌ను కీలకమైందిగా భావిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రభుత్వ పనులను అంచనా వేయడంలో కాగ్ అభిప్రాయాలకు అడ్వాంటేజ్ ఉందని, కాగ్ చేసే సూచనలతో వ్యూహాత్మక పురోగతి జరుగుతుందని, దాన్ని సహకారంగా భావిస్తామని ప్రధాని అన్నారు. పారదర్శకత లేకపోవడం వల్లే గతంలో బ్యాకింగ్ రంగంలో ఎన్పీఏలు పెరిగాయని, కానీ తమ ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని దేశం ముందు పెట్టిందన్నారు. సమస్యలను గుర్తిస్తేనే పరిష్కారాలు వీలవుతాయన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖలు కాగ్ అడిగిన సమాచారాన్ని, డాక్యుమెంట్లు, డేటా, ఫైల్స్ ఇవ్వాలన్నారు. ఆర్థికలోటు, ప్రభుత్వ ఖర్చుపై కాగ్ ఆందోళనలను సరైన స్పూర్తితో స్వీకరించామని మోదీ తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో, బలంగా ఆడిట్లు సాగితేనే, వ్యవస్థ స్థిరంగా, పారదర్శంగా తయారవుతుందని ప్రధాని చెప్పారు. మంచి పద్ధతులపై కాగ్ స్టడీ చేయాలన్నారు. డేటానే సమాచారమని, భవిష్యత్తులో డేటానే చరిత్రను శాసిస్తుందని ప్రధాని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

