Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Janhvi Kapoor | బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్లో పలు సినిమాలు చేసినప్పటికీ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఎదగాలనే లక్ష్యంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Janhvi Kapoor | బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్లో పలు సినిమాలు చేసినప్పటికీ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఎదగాలనే లక్ష్యంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఆమె ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆమె నటించిన సినిమాలు, చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాలకు దారితీయడంతో ప్రస్తుతం జాన్వీ కపూర్ కెరీర్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తాజాగా ఓ చిట్‌చాట్ ఇంటర్వ్యూలో తమిళ చిత్ర పరిశ్రమపై జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
తమిళ సినిమాలు, దర్శకులు, నటీనటులపై ఆమె ప్రత్యేక అభిమానాన్ని వ్యక్తం చేయడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. టాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న జాన్వీ ఇప్పుడు కోలీవుడ్‌పై దృష్టి పెట్టారా? తమిళ చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ పాల్గొన్న ఓ చిట్‌చాట్ ఇంటర్వ్యూ ఆసక్తికరంగా మారింది. తనకు పిన్ని వరుసయ్యే సీనియర్ నటి మహేశ్వరితో కలిసి ఆమె ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళ సినిమాల గురించి, అక్కడి దర్శకులు, నటీనటుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
తాను ఇటీవల తమిళ చిత్రం ‘బ్లాస్ట్’ చూశానని, అందులో ప్రీతి ముకుందన్ నటన తనకు నచ్చిందని జాన్వీ పేర్కొన్నారు. అలాగే సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ రూపొందించే మ్యూజిక్ వీడియోలకు తాను పెద్ద అభిమానినని వెల్లడించారు.ముఖ్యంగా ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆయన తెరకెక్కించే కథలు, సినిమాల్లో ఉండే ప్రత్యేకత తనను ఆకట్టుకుంటాయని వెల్లడించారు. ఇక దళపతి విజయ్ నటించిన ‘పోక్కిరి’ వంటి కమర్షియల్ సినిమాలను కూడా ఇష్టపడతానని తెలిపారు. తన తండ్రి బోనీ కపూర్ నిర్మించిన లేదా రీమేక్ చేసిన తమిళ సినిమాలను కూడా తరచుగా చూస్తుంటానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో జాన్వీకి తమిళ చిత్ర పరిశ్రమపై ఉన్న ఆసక్తి మరోసారి బయటపడింది. అయితే ఆమె వ్యాఖ్యలను కేవలం సినిమాపై ఉన్న ఆసక్తిగా చూడాలా? లేక కోలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భావించాలా? అనే చర్చ మొదలైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

