న్యూఢిల్లీ: రాష్ట్రపతి, గవర్నర్లను ఉద్దేశిస్తూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లులను డెడ్‌లైన్‌లోగా క్లియర్ చేయాలని రాష్ట్రపతి, గవర్నర్లకు ఇటీవల సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు చేసిన ఆ వ్యాఖ్యలను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) తప్పుపట్టారు. న్యాయ వ్యవస్థ వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టులకు లేదని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 142వ అధికరణ ద్వారా సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయని, అయితే ఆ అధికరణను ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఓ న్యూక్లియర్ మిస్సైల్ తరహా వాడుతున్నట్లు ఆరోపించారు.
Not for a moment will I ever say that we must not give premium to innocence. Democracy is nurtured, its core values blossom, and human rights are taken at a high pedestal when we believe in innocence till the guilt is established. Therefore, I must not be misunderstood as casting… pic.twitter.com/IziN2OYf57
— Vice-President of India (@VPIndia) April 17, 2025
ఇవాళ ఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ ఎంక్లేవ్‌లో జరిగిన 6వ రాజ్యసభ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొని ఆయన మాట్లాడారు. భారత రాష్ట్రపతి పదవి చాలా అత్యున్నతమైందని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శపధం చేసి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఇటీవల ఓ తీర్పులో రాష్ట్రపతికి సూచన చేశారని, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామని, దేశంలో ఏం జరుగుతోందని, సున్నితమైన అంశాల్లో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇలాంటి అంశాలపై కేసు ఫైల్ చేయాలా వద్దా అన్న అంశం సరికాదన్నారు. ఇలాంటి ప్రజాస్వామ్యం కోసం మనం వేడుకోలేదన్నారు.
డెడ్‌లైన్ ప్రకారం పనిచేయాలని రాష్ట్రపతిని ఆదేశించడం సరికాదన్నారు. సుప్రీం వ్యాఖ్యలను పరిశీలిస్తే జడ్జీలే శాసన వ్యవహారాలు చూస్తున్నట్లు ఉందన్నారు. ఎగ్జిక్యూటి ఆదేశాలు అమలు చేస్తున్నట్లు ఉందన్నారు. సూపర్ పార్లమెంట్‌ను జడ్జీలు నడిపిస్తున్నట్లు ఉందన్నారు. దేనికీ బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇది ఈ నేల విధానాలకు వర్తించదు అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి సరికాదు అని, అసలు ఏ ఆధారంగా అలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం మాత్రమే రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు ఉందన్నారు. దానికి కూడా అయిదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలన్నారు. న్యాయవ్యవస్థకు ప్రజాస్వామ్య దళాల పట్ల ఆర్టికల్ 142 ఓ న్యూక్లియర్ మిస్సైల్‌గా మారిందన్నారు.