న్యూఢిల్లీ: రాకెట్ మిస్సైల్ దళాన్ని(Rocket Missile Force) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాకెట్లు, మిస్సైళ్ల నేటి రోజుల్లో అత్యవసరంగా మారాయని, శత్రు దేశాలపై ఏదైనా ప్రభావం చూపాలంటే ఆ రెండు కీలకంగా మారినట్లు ఆయన చెప్పారు. రాకెట్ మిసైల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎందుకంటే పాకిస్థాన్ ఇప్పటికే రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని, చైనా కూడా అలాంటి దళాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుత పరిస్థితిలో రాకెట్ మిస్సైల్ దళం అవసరమన్నారు. పినాకా సిస్టమ్‌ను 120 కిలోమీటర్ల రేంజ్లో పరీక్షించామని, 150 కిలోమీటర్ల రేంజ్‌కు చెందిన ఆయుధాలపై ఒప్పందాలు చేసుకున్నామని, ఆ తర్వాత 450 కిలోమీటర్లే రేంజ్ ఆయుధాలపై ఫోకస్ పెడుతామని ఆర్మీ చీఫ్ ద్వివేది అన్నారు. వీలైనన్ని డ్రోన్లను స్వంతంగా తయారు చేసేందుకు తమ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఆర్మీలోని అన్ని కమాండ్ సెంటర్లు దాదాపు 5 వేల డ్రోన్లను ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. ఇవేమీ చిన్న డ్రోన్లు కావని, 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించే డ్రోన్లను పరీక్షించినట్లు చెప్పారు. ఆ రేంజ్‌ను రానున్న రోజుల్లో పెంచనున్నట్లు చెప్పారు.
#WATCH | Delhi: Indian Army Chief General Upendra Dwivedi says, “We need missile force. Today, you will see that rockets and missiles have become intertwined because if we want to achieve an impact, both rockets and missiles can deliver it. We are looking towards a rocket missile… pic.twitter.com/LRLmNytToP
— ANI (@ANI) January 13, 2026