Manoj Jha | లాలూజీ యాదవ్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే: ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా
Manoj Jha | బీహార్‌లో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు కుప్పకూలే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నితీశ్‌కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండటం బీహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.
Manoj Jha: బీహార్‌లో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు కుప్పకూలే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నితీశ్‌కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండటం బీహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఏ క్షణమైనా ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన మహా కూటమి సర్కారు కూలిపోనుందనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ (శనివారం) ఆర్జేడీ శాసనసభాపక్షం సమావేశమైంది. సమావేశం సజావుగా సాగిందని, ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా చెప్పారు. జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలను ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. పార్టీ అధినేత లాలూ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్, పార్టీ ఎమ్మెల్యేలు సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారని చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bhihar
- Lalu Yadav
- manoj jha
- RJD MP
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

