కోల్కతా: పశ్చిమబెంగాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా వరద నీరు చేరడంతో వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతంలో జనం ఇండ్ల నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక బెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో పరిస్థితి దారుణంగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
ఇదిలావుంటే కోల్కతాలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని ఇక్బాల్పూర్, లేక్ గార్డెన్ ఏరియాలో వరదలకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో వీక్షించవచ్చు.
#WATCH | West Bengal: Waterlogging in several parts of Kolkata, following heavy rainfall. Visuals from near Ekbalpur and Lake Gardens.
— ANI (@ANI) September 29, 2021
IMD Kolkata had predicted intense spell of rains accompanied by gusty winds in the city, this morning pic.twitter.com/y7Dr2sw9cF