కోల్కతా: దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహళలు, పురుషులు సంప్రదాయ వస్త్రధారణలో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఇళ్లలోనూ దీపావళి పండుగను పురస్కరించుకుని పూజలు చేశారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి ఇంట్లో కూడా దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. మమత ఇంట్లోని పూజ గదిలో కాళీ మాత చిత్రపటాలను సుందరంగా అలంకరించి అర్చకుల మంత్రోఛ్చరణలతో పూజాధికాలు నిర్వహించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | West Bengal CM Mamata Banerjee participates in Kali Puja prayers at her residence in Kolkata.
(Video Source: CM Mamata Banerjee’s Facebook page) pic.twitter.com/8dv1HVFtng
— ANI (@ANI) November 12, 2023