డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో పుష్పాలతో కళకళలాడుతున్న అందమైన లోయను సందర్శకుల కోసం పునఃప్రారంభించారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌గా పేరుగాంచిన, ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఈ లోయను కరోనా మహమ్మారి విస్తృతి కారణంగా ఇటీవల మూసివేశారు. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతుండటంతో ఇవాళ తిరిగి తెరిచారు.
రకరకాల, రంగురంగుల పూలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ఆ లోయలో ఈ సీజన్లో దాదాపు 50కి పైగా జాతుల పుష్పాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లోకి పర్యాటకులను అనుమతించినా కొవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తామని కేదార్నాథ్ వైల్డ్‌లైఫ్ డివిజన్ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ అమిత్ కుమార్ తెలిపారు.
కొవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారినే వ్యాలీలోకి అనుమతిస్తామని చెప్పారు. కాగా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో రంగురంగుల పుష్పాల సోయగాన్ని కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | 'Valley of Flowers' in Uttarakhand's Chamoli opens for visitors. "This season we have 50 species of flowers. Tourists to be allowed on the basis of negative RT-PCR report & have to abide by COVID-appropriate behaviour," says Amit Kanwar, DFO, Kedarnath Wildlife Division pic.twitter.com/QdTbLFM2yb
— ANI (@ANI) June 30, 2021