లక్నో: గుజరాత్ రాష్ట్రం మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి 132 మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనను మరువకముందే.. యూపీలో అలాంటిదే మరో ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయంగానీ, ఎవరూ గాయపడటంగానీ జరుగలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందౌలి జిల్లాలోని సరయ్యా గ్రామంలో ఛఠ్ పూజ సందర్భంగా.. కాలువపై నిర్శించిన ఓ కల్వర్టు మీద జనం పోటెత్తారు. పాతబడిన ఆ వంతెన బరువును ఆపలేఖ కుప్పకూలింది.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వంతెన కూలిన సమయంలో కాలువలో ప్రవాహం పెద్దగా లేకపోవడం, ఎవరూ నీళ్లలో పడిపోకుండా కూలిన వంతెనపైనే నిబడటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#WATCH | UP: A part of a canal culvert carrying many people collapsed in Chandauli’s Saraiya village of Chakia Tehsil during #ChhathPooja celebrations earlier today
A few bricks of the bridge slipped & fell into the river during #Chhath celebrations, but no one was injured: ASP pic.twitter.com/IQMykWjhrw
— ANI (@ANI) October 31, 2022