న్యూఢిల్లీ: ఫిట్ ఇండియా మూవ్మెంట్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజనుల వ్యవహారాల, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా మొబైల్ యాప్‌ను లాంచ్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ క్రీడాదినోత్సవమైన 2019, ఆగస్టు 29న ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ఆ మూవ్మెంట్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫిట్ ఇండియా మొబైల్ యాప్ లాంచింగ్ జరిగింది.
ఈ ఫిట్ ఇండియా మొబైల్ యాప్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అంతేగాక బేసిక్ స్మార్ట్ ఫోన్లలో కూడా పనిచేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర క్రీడల శాక సహాయమంత్రి నిసిత్ ప్రమాణిక్ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ స్కిప్పింగ్ ఆడి తన ఫిట్నెస్ను రుజువు చేసుకున్నారు. దేశంలోని ప్రతి పౌరుడూ తన ఫిట్నెస్ను కాపాడుకోవాలని సూచించారు. కాగా, మంత్రి తాడుతో ఆడిన ఆట ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నది.
#WATCH | Union Sports Minister Anurag Thakur jumps a skipping rope during the launch of FIT INDIA mobile application in Delhi pic.twitter.com/alRpEMAIT2
— ANI (@ANI) August 29, 2021