సిథోలి: ఉదయ్‌పూర్-ఖజురహో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్సిటీలోని సిథోలి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలు అక్కడికక్కడే నిలిపేశాడు. ఇంజిన్‌లో మంటలు గురించి తెలియగానే ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు.
ముందుగా లోక్ పైలట్ రైలింజన్లోంచి మంటలు రావడాన్ని గమనించారని, ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (OHE) వ్యవస్థను పూర్తిగా ఆపేసి మంటలను అదుపులోకి తెచ్చారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన రైలు ఇంజిన్‌ను తొలగించి, మరో ఇంజిన్‌తో రైలును గమ్యస్థానానికి పంపిస్తామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపుతున్నామన్నారు. కాగా, ప్రమాదం కారణంగా రైలు నిలిచిపోయిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Udaipur city-Khajuraho train stopped at Sitholi railway station in Madhya Pradesh’s Gwalior after a fire was reported in the train engine
Details awaited. pic.twitter.com/7Sm0VRt6k9
— ANI (@ANI) August 19, 2023