Taxic foam : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో యుమునా నది (Yamuna River) కాలుష్య కాసారంగా మారిపోయింది. నీటిలోపై విషపు నురగలు (Taxic foam) తెట్టులా తేలుతున్నాయి. ఈ నురుగల పరిమితి రోజురోజుకు మరింత పెరుగుతోంది. నగరంలోని పలు ఫ్యాక్టరీలు వ్యర్థ రసాయనాలను యమునా నదిలోకే వదులుతుండటంతో.. నీరు పూర్తిగా కలుషితమై నురగలు కడుతోంది. దాంతో నదీ పరిసర ప్రాంతాల ప్రజలు ఆ విష వాయువులను పీల్చుకుని అనారోగ్యాల బారినపడుతున్నారు.
ఒకవైపు కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యాల బారినపడుతుంటే.. నాయకులు మాత్రం ఈ విషయాన్ని తమ రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు నిర్లక్ష్యం వల్లే యమునా నది కాలుష్య కోరల్లో చిక్కుకున్నదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తుండగా.. కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకారం లేకపోవడంవల్లే ఈ కాలుష్య సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకోపోతున్నామని ఆప్ విమర్శిస్తున్నది. కాళింది కుంజ్ ఏరియాలో యమునా నదిపై పేరుకున్న నురగ దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Delhi: Toxic foam seen floating on the Yamuna River in Kalindi Kunj, as pollution level in the river continues to remain high.
(Drone visuals shot at 8:05 am) pic.twitter.com/VAbz2jbNE9
— ANI (@ANI) November 2, 2024