న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) లో చేరే ప్రసక్తే లేదని, తాను నితీశ్ కుమార్ (Nitish Kumar) వెంటే ఉంటానని ప్రమాణం చేశానని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థానీ అవామ్ మోర్చా (HAM) పార్టీ అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం మాంఝీ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.
హోంమంత్రితో భేటీ అనంతరం బయటకు వచ్చిన మాంఝీని మీరు NDAలో చేరుతున్నారా..? అని మీడియా ప్రశ్నించగా మాంఝీ పైవిధంగా స్పందించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన కితాబిచ్చారు. నితీశ్ దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నారని మాంఝీ చెప్పారు.
అంతకుముందు మాంఝీ తన అనుచరులతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రికి మాంఝీ ఒక వినతి పత్రం సమర్పించారు. అయితే, తాను ఓ పని విషయంలో మర్యాదపూర్వకంగా హోంమంత్రిని కలిశానని, మా భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని మాంఝీ చెప్పారు.
#WATCH | There is no question of it (joining NDA). I’ve taken a vow that I will stay with Nitish Kumar. Nitish Kumar has all the qualities to become a PM. He is making an honest effort to unite the opposition parties: Former Bihar CM Jitan Ram Manjhi pic.twitter.com/3jJoSmFEyR
— ANI (@ANI) April 13, 2023
#WATCH | Former Bihar CM Jitan Ram Manjhi meets Union Home Minister Amit Shah, in Delhi pic.twitter.com/yWiFsJ2plT
— ANI (@ANI) April 13, 2023