ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని వానలు ముంచెత్తుతున్నాయి. ముంబైలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెంబూర్‌లో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై భారీగా వరదనీరు నిలిచి సరసులను తలపిస్తున్నాయి. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా వడాల ఏరియాలో కూడా ఈ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. మెరైన్ డ్రైవ్ ఏరియాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సుమారు మూడు నుంచి ఐదు మీటర్ల ఎత్తుతో అలలు ఎగిసిపడుతున్నాయి.
ఇదిలావుంటే.. ముంబైలో ఈ రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండటంతో, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు, వరదలకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోల్లో చూడవచ్చు.
#WATCH | Several parts of Mumbai face waterlogging as the region continues to receive rainfall. Visuals from Chembur. pic.twitter.com/HiCH9bUjxR
— ANI (@ANI) July 21, 2021
#WATCH | Rain continues in parts of Mumbai. Visuals from Marine Drive#Maharashtra pic.twitter.com/4GyGlu22uG
— ANI (@ANI) July 21, 2021
Maharashtra: Heavy rainfall continues to lash Mumbai, visuals from Wadala.
— ANI (@ANI) July 21, 2021
As per India Meteorological Department's (IMD) forecast, Mumbai will experience 'generally cloudy sky with heavy rain' today. pic.twitter.com/E2gzAd3CmE