న్యూఢిల్లీ: సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు.. సూర్యోదయాలు, సూర్యస్తమయాలు.. వారాలు, నెలలు, సంత్సరాలు.. ఇలా కాలం గడిచిపోతూనే ఉంటుంది. ఎవరి కోసం ఆగకుండా కాలం పరుగులు కొనసాగుతూనే ఉంటాయి. పాత ఏడాదులు వెళ్లిపోతుంటాయి. కొత్త సంవత్సరాలు వస్తుంటాయి. ఇప్పుడు క్రీస్తు శకంలో 2021 సంవత్సరాలు గడిచిపోయాయి. మరికొన్ని గంటల్లో ప్రపంచం 2022వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నది.
న్యూజీలాండ్‌లో ఇప్పటికే నూతన సంవత్సరం వచ్చేసింది. అక్కడి ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. మనమూ ఆ సంబురాలు చేసుకోవడానికి కొన్ని గంటలే ఉంది. పాత సంవత్సరం ఆఖరి గడియలు మిగిలి ఉన్నాయి. ఆఖరి పగలు ఇప్పటికే అయిపోయింది. చివరి సూర్యస్తమయం జరిగింది. ఈ ఆఖరి సూర్యస్తమయానికి సంబంధించిన అరుదైన దృశ్యాలను కింది వీడియోలో వీక్షించండి. ఢిల్లీలోని యమునా నది తీరం నుంచి ఈ సుందర దృశ్యాలను కెమెరాలో బంధించారు.
#WATCH Last sunset of the year 2021 from Delhi's Yamuna Bank pic.twitter.com/1WWPNDOvir
— ANI (@ANI) December 31, 2021